ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న హీరోలందరికీ ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. గురువారం సినిమా రంగానికి చెందిన అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఓ పరిష్కారం కనుగొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి ప్రాక్టికల్ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్…