తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు.…
ESIC to expand: ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 598 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ESICని 750 జిల్లాలకు విస్తరించనున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ESIC పథకం కింద ఇప్పుడు 3 కోట్ల 90 లక్షల కుటుంబాలు, 12 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ESICని భవన నిర్మాణ రంగానికి కూడా విస్తరింపజేస్తామని…