అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేం చెప్పలేదన్నారు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే కొనసాగవచ్చు అన్నారు.. ఇక, పరిశ్రమలు తరలిపోవాలని మేం కోరుకోం అని స్పష్టం చేశారు.…