కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.. టూవీలర్లపై వస్తున్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.. అమలాపురంలోకి ఎంట్రీ ఇచ్చే వాహనదారులు వివరాలు మొత్తం సేకరిస్తున్నారు.. ఇక, రోడ్లపైకి వచ్చే ఆందోళన చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆయన.. విధ్వంస చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం…
కోనసీమ జిల్లా పేరు మార్చడం.. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నిన్న విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ ఆందోళలనపై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చటం జరిగిందన్న ఆయన.. అంబేద్కర్ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వాడు కాదు.. అంబేద్కర్…