Oke Oka Jeevitham: వైపుంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రముఖ నటుడు నాగార్జున ఫిల్మ్ నగర్ లో డెంటల్ క్లీనిక్ ను ఆరంభించారు. తన చిరకాల మిత్రుడు సాయి డెంటల్ క్లీనిక్ అధినేత ఎ.పి. మోహన్ కొత్తగా ఫిల్మ్ నగర్ లో పెట్టిన సాయి డెంటల్ క్లీనిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయ ఆవిష్కరణను జరిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఏషియన్ సునీల్ కూడా హాజరై మోహన్ కి అభినందనలు తెలియచేశారు.
(సెప్టెంబర్ 12న అక్కినేని అమల పుట్టినరోజు) అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా, అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తున్నారు అమల. నవతరం కథానాయకుడుగా తనయుడు అఖిల్ ను…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’.. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి…
ఈ యేడాది ‘శ్రీకారం’తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒకటి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఒకే ఒక జీవితం’ అనే…