ప్రముఖ నటుడు నాగార్జున ఫిల్మ్ నగర్ లో డెంటల్ క్లీనిక్ ను ఆరంభించారు. తన చిరకాల మిత్రుడు సాయి డెంటల్ క్లీనిక్ అధినేత ఎ.పి. మోహన్ కొత్తగా ఫిల్మ్ నగర్ లో పెట్టిన సాయి డెంటల్ క్లీనిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయ ఆవిష్కరణను జరిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఏషియన్ సునీల్ కూడా హాజరై మోహన్ కి అభినందనలు తెలియచేశారు.