తెలంగాణలో మద్యం కిక్కు బాగా ఎక్కువైంది. ధరలు పెరిగినా మందుబాబుల తీరు మారడం లేదు. ధర ఎంతైనా తాగేస్తాం.. ఊగేస్తాం అన్నట్టుగా వుంది వారి తీరు. మే నెలలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత నెల కన్నా పెరిగిన మద్యం సేల్స్ మందుబాబుల దూకుడుకు సంకేతంగా చెబుతున్నారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు తగ్గుతాయని భావించారు. కానీ అలాంటిదేం లేదని తేలిపోయింది. ఏప్రిల్ నెలలో 27 లక్షల 92వేల721 లిక్కర్ కేసులు…