దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి…