తెలుగు చిత్రసీమ నవ్వులతోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య. ఆయన పంచిన నవ్వులు ఈ నాటికీ సువాసనలు వెదజల్లుతూ కితకితలు పెడుతూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య అంతటి విజయం చూసిన హాస్యనటులు మరొకరు కానరారు. మూడు తరాలుగా అల్లువారి కుటుంబం సినిమారంగంలో అలరిస్తూనే ఉండడం మరో విశేషం! అల్లు రామలింగయ్య హాస్యంలో అల్లుకు పోయే గుణం ఉండేది. ‘అతి’ కనిపించినా, అదీ పాత్రకు అతికినట్టుగానే అనిపించేది. తనకు లభించిన ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ…