Allu Vs Mega War: అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా ఈ గ్యాప్ అన్‌వాంటెడ్‌గా వచ్చింది కాదని.. కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.