ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలకు జపాన్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల అక్కడ ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా ఈ జోడి జపాన్‌లో సందడి చేసింది. ఈ పర్యటనలో ‘కజు’ అనే ఒక జపనీస్ అభిమాని అల్లు అర్జున్, రష్మికలను ఇంటర్వ్యూ చేస్తూ, అనూహ్యంగా తెలుగులో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. అర్జున్ అతనితో జపనీస్‌లో మాట్లాడటానికి ప్రయత్నించగా, ఆ అభిమాని మాత్రం.. ‘మీరు తెలుగు సినిమాలకే గర్వకారణం. నేను…