అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో అల్లు అర్జున్ ఉండనున్నారు. ఈ నేపద్యంలో 27వ తేదీ వరకు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆయనను నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకి భారీ భద్రత నడుమ తరలించారు.…
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు. సతీమణి స్నేహకు ముద్దుపెట్టిన బన్నీ.. పోలీసులతో కలిసి వాహనం ఎక్కారు. స్టార్ హీరో అల్లు…