సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో అల్లు అర్జున్ ఉండనున్నారు. ఈ నేపద్యంలో 27వ తేదీ వరకు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆయనను నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకి భారీ భద్రత నడుమ తరలించారు. అభిమానులు అడ్డుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా ఆయన తీసుకువెళ్లారు. మరోపక్క చంచల్గూడ జైలు వద్ద కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Allu Arjun- Ys Jagan: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్
మరోపక్క హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదాలు సాగుతున్నాయి. అసలు సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ కు సంబంధం లేదు కాబట్టి ఆ కేసు నుంచి మినహాయించాలని అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక నాంపల్లి కోర్టులో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. అయితే ఒక మహిళ మృతి చెందిన కేసు కావడం అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసులు నాన్ బెయిల్బుల్ కావడంతో నాంపల్లి కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్కు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ని పోలీసులు అత్యంత భారీ భద్రతతో చంచల్గూడ జైలుకు తరలించారు.