జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరితో కలిసి చర్చించాకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు. పొత్తులపై అందరిదీ ఒకే…
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్…
ఏపి రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందా ? రెండున్నరేళ్ల ముందే ఎన్నికల పొత్తుల మాట తెరపైకి వస్తోందా? మాజీ మంత్రి పితాని జనసేనపై చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? జనసేనతో ప్రయాణంపై టిడిపిలో ఉన్న మాటే ఆయన చెప్పారా? ఈ చర్చ ఎటువెళుతోంది? దీనిపై బిజెపి ఏమంటోంది? ఏపి లో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ, 2024 లో జరిగే ఎన్నికల్లో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపిలో ప్రస్తుతానికి…
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అపార చాణిక్యుడినంటూ చెప్పుకునే చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోందని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. గతంలో ఆయన నమ్ముకున్న రెండుకళ్ల సిద్ధాంతం బెడిసి కొట్టి చివరికి రాష్ట్ర విభజనకు దారితీసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని నుంచి ఆయన ఏం గుణపాఠం నేర్చుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మళ్లీ మళ్లీ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ చేస్తున్నారని అంటున్నారు.…
బహుజన వాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్తారన్నది మొదటి నుంచి ఆసక్తికరంగానే ఉంది. ఆయన ముందు టీఆర్ఎస్ లో చేరతారని అనుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయన విధానాలు చూసి.. ఎలాగూ బీజేపీలో చేరరు అనే అంతా భావించారు. కానీ.. ఏ పార్టీతో కలిసి నడవకుండా.. తన విధానంలోనే ముందుకు వెళ్లి.. బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. తన నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్..…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల పరంగానూ బీజీగా మారిపోయారు. ఒకేసారి రెండు పడవలను నడుపుతున్న ‘పవర్ స్టార్’ తొలి నుంచి తనది పాతికేళ్ల రాజకీయమని చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ అనుభవాన్ని సంపాదిస్తూ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాజకీయపరంగా చాలా గుణపాఠాలను నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని లైమ్…