Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి.