వ్యాక్సిన్ల విషయంలో క్రమంగా రాష్ట్రాలను కదులుతున్నాయి… కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్‌లకు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాలని కోరారు వైఎస్…