Union Cabinet: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది. అలాగే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 28) ఢిల్లీలో జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించబోతున్నట్లు తెలిపింది.