ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, అన్ని విభాగాలు, అన్ని కేటగిరీల ఉద్యోగులకు కూడా ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియట్ సిబ్బంది వరకు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోనున్నారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇదే విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ముందుగా.. సెక్రటేరియట్,…