పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం.. కొన్ని పాలు.. ఓ బుక్కెడు అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటి పెట్టుకుని తిరుగుతాయి కుక్కలు.. అలాంటి ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది.