అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు గొప్ప సన్మానం చేసింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా తన సేవలు అందించాడు. 2018 సెప్టెంబర్ లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ పలికినప్పటికీ.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. ఇప్పుడు తన 38 ఏళ్ల వయస్సులో అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.