Israel: ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి.
Israel: మధ్యప్రాచ్చంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రోజు జెరూసలెంలోని ప్రఖ్యాత అల్-అక్సా మసీదులో ఘర్షణ తర్వాత ఇజ్రాయిల్ వరసగా దాడులను ఎదుర్కొంటోంది. అల్-అక్సా ఘటన తర్వాత పాలస్తీనా గాజా నుంచి, లెబనాన్ నుంచి రాకెట్ దాడులను ఎదర్కొంది ఇజ్రాయిల్. దీనికి ప్రతీగా ఇజ్రాయిల్ పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులు చేస్తోంది.