Akhil Akkineni: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. మొదటి సినిమా నుంచి.. ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కొద్దిగా ఊరట నిచ్చినా.. ఏజెంట్ సినిమా మరీ అయ్యగారిని పాతాళంలోకి దించేసింది.