Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, తమ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. ఈ జంట ఎప్పుడు మీడియా కంట కనిపించినా దిష్టి తగులుతుందేమో అన్నంతగా అభిమానులు మురిసిపోయేవారు.