నందమూరి బాలకృష్ణ “అఖండ” మూవీ 2021 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో చేసినంత సందడిని మరే ఇతర సినిమాలు చేయలేకపోయాయి. ఇక దేశంలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా “అఖండ” మోత గట్టిగానే మోగింది. ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ తమన్…