నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” చిత్రం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రాన్ని మే 28 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేసింది. కాని మహమ్మారి కారణంగా “అఖండ” విడుదల వాయిదా పడింది. ఇప్పుడు వినాయక చతుర్థి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ షూట్ తిరిగి ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నారు.…