Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.