తెలుగు సినిమా ప్రేక్షకులకి, అన్ని కులాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్తులు. గత కొద్ది కాలంగా ‘కన్నప్ప’ చిత్రం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి ఆ సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను. నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్, బ్రాహ్మణుడిని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ ముకేష్ కుమార్ సింగ్ గారు కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవి సీరియల్ మహాభారతాన్ని…