తెలుగు సినిమా ప్రేక్షకులకి, అన్ని కులాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్తులు. గత కొద్ది కాలంగా ‘కన్నప్ప’ చిత్రం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి ఆ సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను. నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్, బ్రాహ్మణుడిని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ ముకేష్ కుమార్ సింగ్ గారు కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవి సీరియల్ మహాభారతాన్ని అత్యద్భుతంగా తీసిన దర్శకులు.
Also Read : RajniKanth : ఆ దర్శకుడితో రజనీ సినిమా.. వర్కౌట్ అవుతుందా.?
ఈ చిత్రంలో బ్రాహ్మణులని గానీ, ఏ ఇతర కులాల వారిని గానీ కించపరచలేదు. అలాగే ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన చిత్రాలలో కన్నడ
కంఠీరవ రాజ్ కుమార్ నటించిన ‘శ్రీ కాళహస్తి మహత్యం, కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ చిత్రాలలో గుడిలో ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను (మొదటి చిత్రంలో ముదిగొండ లింగమూర్తి, రెండవ దాంట్లో రావుగోపాల రావు పోషించారు). గుడిలో దేవుడి నగలు తీసుకెళ్ళి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన మంచు విష్ణు ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీ కాళహస్తీ మహత్యం గ్రంధం ఆధారంగా, మోహన్ బాబు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్ధమవుతుంది. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, చిత్రాన్ని పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకి చూపించారు. వారు చిత్రం ఎంతో ఉన్నతంగా వుందని ప్రశంసించి, మోహన్ బాబు, శ్రీ విష్ణుని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఇక ఈ చిత్రంలో పాటని రాసిన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారితో పాటు ఎందరో బ్రాహ్మణులు వివిధ శాఖలలో పనిచేసారు. ఏ వర్గం వారిని కించపరచడానికి, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి చిత్రాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికీ లేదు. చివరగా, కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుటాడు’ అని లేఖ విడుదల చేసారు.