నిర్మాత, దర్శకుడు సి.వి రెడ్డి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సమాజంలోని సమస్యను తీసుకుని ఆలోచింపజేసేలా కథను తయారు చేసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సీవీ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎనిమిది సంవత్సరాల తరువాత నిర్మిస్తున్నారు. కరోనా టైమ్ లో కథను తయారు చేసుకున్న సివి రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. ఈ కథ తనని బాగా ప్రభావిత చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతో తీయబోతున్నట్లు చెబుతున్నారు.…