అరుణ్ విజయ్, ప్రియా భవానీ జంటగా నటిస్తున్న తమిళ సినిమా ‘యానై’. తెలుగులో దీనిని ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఈ రెండు భాషల్లో సినిమా ఇదే నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ చిత్రబృందం సమక్షంలో హైదరాబాద్ లో తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. యాక్షన్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘సింగం’ సీరిస్ ఫేమ్ హరి దీనికి దర్శకత్వం వహించారు. విశేషం ఏమంటే…