జనాభా పెంపుదల పై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశానికి సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉంది.. మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పైనే.. లేదంటే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడనుంచి ఇక్కడకు మైగ్రేషన్ పెరుగుతుందన్నారు.. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.. కానీ, ఆ ఆలోచన విరమించుకుని జనాభా పెంపుదలపై దృష్టి పెడితే మనమే ప్రపంచాన్ని శాసిస్తాం అని ఆసక్తికర కామెంట్లు చేశారు..
ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఐఐటీ మద్రాస్ లో "అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025" లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం ఇండియాదే అన్నారు..