భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది.