Air India flights: అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత నుండి ఎయిర్ ఇండియా కంపెనీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అనేక ఫ్లైట్స్ రద్దు అవుతున్నాయి. ఎయిర్ ఇండియా శుక్రవారం (జూన్ 20) భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయం విమానాల మెరుగైన మైన్‌టెనెన్స్, తీవ్ర వర్షాలు, వాతావరణం కారణంగా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. Also: International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా…
ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేరుతో తమ వినియోగదారులకు లేఖ రాశారు. ఇందులో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై స్పందించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. కింద భవనంలో ఉన్న 34 మంది పౌరులూ ప్రమాదంలో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి టర్కిష్ టెక్నిక్ ఎయిర్ ఇండియాతో నిర్వహణ ఒప్పందాన్ని కలిగి ఉన్నప్పటికీ.. అది బోయింగ్ 777 వైడ్-బాడీ విమానాలకు మాత్రమే పరిమితం అని, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను కవర్ చేయదని అధికారులు వివరించారు. ఈ ఒప్పందాలు 2024, 2025లో సంతకం చేయబడ్డాయి. Read Also: Phone Tapping : ఫోన్ ట్యాపింగ్…
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆకాశ్ వత్స అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. విమానం కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు.