దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్‌లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్‌బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్తాంబుల్ మార్గంలో కార్యకలాపాల కోసం టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను కంపెనీ లీజుకు తీసుకుంది.