Air India Flight: ఎయిర్ ఇండియా విమానం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. 270 మంది ప్రాణాలను తీసిన ఈ ఘోర దుర్ఘనటలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి జరిగిన ఘోరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే AI-171 ఫ్లైట్, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నియంత్రణ తప్పి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనానికి ఢీకొని పేలిపోయింది. ఈ విషాద సంఘటనలో మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం తర్వాత జరిగిన రేస్క్యూ…
ఎయిరిండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. 2016 నుంచి 2021వరకు విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా సేవలందించిన విషయం తెలిసిందే. 242 మందితో ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.