Air India: వరస బాంబు బెదిరింపుల ఘటనలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరసగా నాలుగో రోజు కూడా బాంబు బెదిరింపు వచ్చాయి. ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి కొన్ని గంటల ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 గురువారం తెలిపింది. విమానం ‘‘స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది.