Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
1985 Air India bombing: జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 39 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు.