హనుమకొండ జిల్లా ఐనవోలు, భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ప్రధాన జాతర భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో కలిసి వచ్చినప్పటికీ ఉగాది వరకు భక్తుల సందర్శన కొనసాగుతుంది. ‘ధ్వజారోహణం’ కార్యక్రమంతో జాతర ప్రారంభమైంది. దాదాపు 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని 11వ…