మరోసారి టీఆర్‌ఎస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతల ఆస్తులు విచ్చల విడిగా పెరుగుతున్నాయని, తెలంగాణ కోసం పోరాడిన పేదొడు పేదొడిగానే మిగిలిపోయాడంటూ ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని, వంద కోట్ల విలువైన భూమిని ఎలా టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్‌కు కూత వేటు దూరంలో మళ్ళీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు…