AIADMK-BJP: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు కూడా గంటల తరబడి చర్చించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-అన్నాడీఎంకేల పొత్తు తెర పైకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ ఎలాంటి పొత్తు లేదని, ఎన్నికల సమయంలోనే ఎన్నికల పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు సోమవారం తారాస్థాయికి చేరుకున్నాయి.