సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సర్జరీ తర్వాత కోలుకోవడానికి వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తుంటారు. అయితే, నొప్పులతో బాధపడుతున్న రోగులు ప్రతిరోజూ క్లినిక్‌లకు లేదా ఆసుపత్రులకు వెళ్లడం అనేది శారీరకంగా, ఆర్థికంగా ఎంతో భారంతో కూడుకున్న పని. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఇప్పుడు ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ సహాయంతో నిపుణులైన ఫిజియోథెరపిస్ట్…