అహ్మదాబాద్ నగరాన్ని పోలీసుల గుప్పిట్లోకి తీసుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా సిటీ వ్యాప్తంగా గట్టి బందోబస్తు చేశారు. ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తో పాటు పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు వస్తుండటంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత సమావేశం నిర్వహించారు.