Bomb Treat : షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి ఎలాంటి ప్రమాదం…
Air India Flight: ఎయిర్ ఇండియా విమానం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. 270 మంది ప్రాణాలను తీసిన ఈ ఘోర దుర్ఘనటలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 265 మంది మృతదేహాలకు సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతుంది. అయితే, విమాన ప్రమాదంలో ఛిద్రమైన కొన్ని మృతదేహాలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తిస్తున్నారు.
Air India Place Crash: తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగింది అన్నారు.
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఇలా పలు రాష్ట్రాలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పటికే వీటిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక హోటల్ నుండి జరుగుతున్న బంగారు అక్రమ రవాణా సిండికేట్ ను బట్టబయలు చేశారు. ఈ ఫలితంగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.75 కోట్ల విలువైన 10.32 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా., డిఆర్ఐ అధికారులు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ…
అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారు కాగా.. వారు హింసను సృష్టించడానికి ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రస్దీన్‌లుగా గుర్తించారు.
దేశంలో ఐదో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. ఓ వార్త కలవరపెడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. కేంద్ర ఏజెన్సీల నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా గుజరాత్ ఏటిఎస్ (ATS) ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) అబుదాబి వెళ్తున్న ఎయిర్ అరేబియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం రెండు ఇంజిన్లలో ఒకటి ఆకాశంలో విఫలం అవ్వడంతో సిబ్బంది ‘ మేడే’ ప్రకటించి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం విచారణకు ఆదేశించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో…