Telangana Exports: వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం.