ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రస్తుత పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యయసాయ 14 కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్దతులను అవలంభించాలన్నారు. పంటల సాగులో ఇతర దేశాలు…