అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అగ్నివీరుల ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ1, బీ1, సీ1 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో షిఫ్టు 11.30 గంటలకు మూడో షిఫ్టు మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి జూలై 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.