లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానంటున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. కెరీర్ ప్రారంభం నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ, సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. వరుసగా స్టార్ హీరోలకు దర్శకత్వం వహిస్తూ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో “సైరా” అనిపించినా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఒక స్పై థ్రిల్లర్ కథాంశాన్ని తీసుకుని అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు.…
యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న చిత్రం “అఖిల్”. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో విన్పిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడట. ముందుగా ఈ సినిమాకు తమన్…
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో, డైరెక్టర్ మధ్య క్యాజువల్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అఖిల్, సురేందర్ రెడ్డి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించారు. ఇక “ఏజెంట్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిపోయాడు. కండలు తిరిగిన…
‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా…
అఖిల్ అక్కినేని కెరీర్‌లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన…
సినిమా రంగంలో వారసులదే హవా అని చాలామంది భావిస్తారు. కానీ ఆ వారసులు సైతం ప్రతిభ లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద నిలబడలేరు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి, విజయతీరాలను చేరుకోవడానికి నిరంతరం వీళ్ళూ శ్రమించాల్సిందే. స్టార్స్ కొడుకులుగా వీళ్ళకు ఎంట్రీ సులువుగా ఉంటుందేమో కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తవాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నట వారసులపై అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అవి వరం గానే కాకుండా ఒకోసారి శాపంగానూ…
అక్కినేని అఖిల్ 5వ చిత్రం “ఏజెంట్” అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్యాంటులో తుపాకీ పెట్టుకుని సూపర్ హాట్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం మన యంగ్ హీరో చాలానే కష్టపడ్డాడు. ఆయన పడిన శ్రమ పోస్టర్ లో స్పష్టంగా కన్పిస్తోంది. సురేందర్ రెడ్డి…
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు దీన్ని జనం ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు తహతహ లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్…
కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్ పాత్రలో మెప్పించిన ఉపేంద్ర, ప్రస్తుతం ‘గని’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అక్కినేని అఖిల్ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఉపేంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ డిఫరెంట్ లుక్ కనిపించనున్నాడు. కరోనా…