మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వయసు ఎంతో మీకు తెలుసా?! 70 సంవత్సరాలు!! చిత్రం ఏమంటే… ఆయనతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు, మరి కొందరు సినిమా రంగం నుండే తప్పుకున్నారు. మమ్ముట్టిని ఇప్పటికీ 70 సంవత్సరాల వ్యక్తిగా అంగీకరించడానికి ఎవరి మనసూ ఒప్పుకోదు. ఇటీవల మమ్ముట్టి తాను డిగ్రీ చదివిన ఎర్నాకులం మహారాజా కాలేజీ రీ-యూనియన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో అతని క్లాస్ మేట్స్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగాడు.…