పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సు వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లా కమిషన్ కీలక సూచనలు చేసింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లేనని, 16కి తగ్గించవద్దని లా కమిషన్ కేంద్రానికి సూచించింది.
చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యునిసెఫ్‌తో కలిసి జువెనైల్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించిన పోక్సో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు.