బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తేలింది.
ఈ కీలక పోరుకు భారత జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు.